దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 90 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 45, 882 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 584 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 48,493 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,43,794 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,28,410 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,32, 162 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.60 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 4. 93 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 12,85,08,389 కు చేరింది.
previous post
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి : స్పీకర్ తమ్మినేని