telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసులో ట్విస్ట్… పోలీసుల హస్తం… రియాను కాపాడే ప్రయత్నం జరుగుతోందా ?

Rhea

జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 40 మందిని ముంబై పోలీసులు విచారించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ రెండు వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రియా చక్రవర్తి అభ్యర్థించింది. కాగా… చాలా రోజుల త‌ర్వాత సుశాంత్ తండ్రి.. త‌న కొడుకు మృతికి అత‌ని స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణ‌మంటూ పాట్నాలో కేసు న‌మోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తిగా రియా చూసుకుందని, సుశాంత్ ఆత్మహత్యకు 6 రోజుల డబ్బు, నగలతో ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని కేకే సింగ్ ఫిర్యాదులో వెల్లడించారు. ఇప్పుడు ఆమెని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ గురించి ఇంగ్లీష్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో పోలీసులు చాటుగా మాట్లాడుకుంటున్న ఒక వీడియోను ప్రసారం చేసారు. సుశాంత్ బెడ్ రూమ్ లో పోలీసులు తనికీలు చేయడం, ఆ తర్వాత ఈ విషయం బయటకి వస్తే దర్యాప్తుకి ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుకోవడం ఆ వీడియోలో వినిపించిందట. అంటే సుశాంత్ కేసు విషయంలో ఎవరో పోలీస్ రియాకి సాయం చేస్తున్నారా? అనే వాదన వినిపిస్తుంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సడెన్‌గా అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా తనపై పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Related posts