తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చను చేపట్టారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సీఎల్పీ నేతగా ఎంపికైన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా స్పీకర్ పోచారం ప్రకటించారు.
ప్రతిపక్షనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ అభినందించారు. 119 స్థానాలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 10 శాతం సీట్లు సాధించే పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ వ్యవహరిస్తారని స్పీకర్ ప్రకటించారు.
ప్రజలు తిరస్కరించినా లోకేశ్ కు బుద్ధి రాలేదు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు