telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వల్ల ఎంతో నష్టపోయాం..చైనా తీరుపై ట్రంప్ అసంతృప్తి

trump usa

ప్రపంచ దేశాలను అతలాకుతలంచేస్తున్న కరోనా వైరస్ కు చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వల్ల అమెరికాకు తీరని నష్టం వాటిల్లిందని ఆయన మండిపడుతున్నారు. చైనా తీరు తమకు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని ట్రంప్ అన్నారు. కరోనా మమహ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అది పుట్టిన కేంద్ర స్థానంలోనే దాన్ని నియంత్రించాలని చెప్పారు. తక్షణమే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని… లేకపోతే మరింత నష్టం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత దారుణ పరిస్థితికి మీరే బాధ్యులని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి అమెరికా లోతైన దర్యాప్తును చేపడుతోందనే విషయం చైనాకు తెలిసే ఉంటుందని చెప్పారు.కరోనా కారణంగా జరిగిన నష్టానికి గాను జర్మనీకి చైనా 165 బిలియన్ డాలర్లను చెల్లించాలంటూ ఒక జర్మన్ పత్రిక ఎడిటోరియల్ రాసిన సంగతి తెలిసిందే. జర్మనీ డిమాండ్ చేసేదానికన్నా ఎక్కువ మొత్తన్ని తాము డిమాండ్ చేస్తామని ట్రంప్ తెలిపారు.

Related posts