telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనానుంచి కోలుకున్న సింగర్‌ కనికాకు షాక్ ఇచ్చిన పోలీసులు

kanika-kapoor

బాలీవుడ్ సింగర్‌ కనికాకు మరో షాక్ తగిలింది. ఈ మధ్యనే కరోనానుంచి కోలుకొని ఇంటికి వచ్చింది కనికా. ఈగాయనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఆమె తరఫున స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు లక్నో పోలీసులు. ఈ మేరకు ఈ నెల 30వరకు ఆమెకు గడువును ఇస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన తరువాత కనికాకు తీవ్ర జ్వరం ఉండగా.. ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి కావాలనే నిర్లక్ష్యం చేసిందంటూ లక్నో పోలీసులు గత నెలలో ఆమెపై ఎఫ్‌ఆర్ఐ నమోదు చేశారు. ఈ విషయంలో ఆమెకు పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ జేపీ సింగ్ మాట్లాడుతూ.. నోటీసులను కనికాకు స్వయంగా అందించాం. సరోజినీనగర్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి.. ఆమె తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాల్సి ఉంది అని అన్నారు. తన తరఫున లాయర్‌ను కలిసిన తరువాత స్టేట్‌మెంట్ ఇస్తానని ఈ సందర్భంగా కనికా తమకు చెప్పినట్లు ఆయన వివరించారు. కాగా కనికా స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటామని కృష్ణా నగర్ ఏసీపీ దీపక్ కుమార్ వెల్లడించారు.

Related posts