రవీంద్ర జడేజా రీ ఎంట్రీతో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనన్నాడు మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్. తాజాగా పార్దీవ్ పటేల్ మాట్లాడుతూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో పోల్చి చూస్తే అన్ని విధాల కోహ్లీసేన మెరుగ్గా ఉంది. బీసీసీఐ 20 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పుడే విజయం మనదే అని అర్థమైంది. వీరికి తోడుగా నలుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా ఎంపికచేశారు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రవీంద్ర జడేజా దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ వచ్చీ రావడంతోనే 23 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడు జడేజా తుది జట్టులోకి వచ్చిన నేపథ్యంలో అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే.. అయినా మంచి జట్టుతో మ్యాచ్‌ను గెలవడం అవసరం’అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు. ఇక జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా కివీస్, భారత్‌ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
previous post
బీసీలకు జగన్ ప్రభుత్వం ద్రోహం: యనమల