telugu navyamedia
రాజకీయ

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి..

మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సీఈవో, సత్య నాదెళ్ల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అతని వయస్సు 26 సంవత్సరాలు. సత్య, ఆయన భార్య అనుపమ దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కన్నుమూశాడు. జన్యు లోపం వల్ల పుట్టుకతోనే జైన్ అనారోగ్యానికి గురయ్యారు.

జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్​ ఎక్జిక్యూటివ్​ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.

Microsoft CEO, wife give $2 million to UWM to bolster tech education

సత్య నాదెళ్ల-అనుపమ దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి. కొడుకు జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీ తో జన్మించాడు. తను నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడనూలేడు. గడిచిన 26 ఏళ్లుగా జైన్ వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు. కొడుక్కి నయం చేయించుకోడానికి సత్య దంపతులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, బాధను దిగమింగుతూ సత్య నాదెళ్ల కుటుంబం ముందుకెళుతోంది.

సత్యనాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ CEO అయినప్పటి నుంచి వైకల్యాలున్న వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్​ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.

Related posts