telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతిరోజూ ఇలా చేస్తే.. కరోనా పరార్

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రం చేసుకుంటే మాత్రమే సరిపోదు. ఎవరికైతే ఇమ్మునిటీ బాగా ఉంటుందో వారిలో కొన్ని చిన్న చిన్న సమస్యల రూపంలో (mild symptoms) కనపడి కరోనా బయటకు వెళ్లిపోతుంది. 

 

*👉 అక్కడ ఎక్కడో ఎవరికో వచ్చిందిలే మనకు కాదు కదా… మనకు ఎందుకు వస్తుంది అని అనుకోకండి.*

 

👉తప్పకుండా నీకు కూడా వస్తుంది అనేది 100% వాస్తవం అని గుర్తు పెట్టుకోండి.

 

*👉చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు అనేది వాస్తవం.*

 

*👉మన కళ్ళ ముందే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కనీసం మనం పాటించాల్సిన నియమాలు పాటిద్దాం..*

 

*👉ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వేడి నీళ్లలో కొంచెం రాళ్ళ ఉప్పు మరియు కొంచెం పసుపు వేసి బాగా కలిపి 5 నుండి 10 నిమిషాల వరకు తల పైకెత్తి గార్లింగ్ చేయండి.*

 

*👉అర్ధ గంట తర్వాత గోరువెచ్చని నీళ్లు 750ml నుండి 1ltr వరకు త్రాగండి.*

 

👉ఆ తర్వాత సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో వ్యాయామం చేయడం మరవకండి. ధ్యానం మరియు ప్రాణాయామం కూడా చేయాలి. 

 

*👉కాలకృత్యాలు ముగించుకుని వేడి నీళ్లలో పసుపు మరియు మెంతో ప్లస్ లేదా అమృతాంజన్ వేసి 10 నిమిషాల నుండి 15నిమిషాల వరకు బాగా ఆవిరిపట్టండి.* 

 

👉అరగంట తర్వాత వేడి నీటితో తల స్నానం చేయండి. 

 

*👉మీరు వదిలిన బట్టలు మరియు మీరు వాడిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా మరిగించిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరువాత వాటిని ఉతికి బాగా ఎండ తగిలే చోట ఆరబెట్టండి.*

 

👉 స్నానం అయ్యాక గోరు వెచ్చగా కాషాయం త్రాగండి (కాషాయం తయారీ ఇదివరకే పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి చూడండి) .

 

*👉 అల్పాహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి. జావ(రాగి జావ లేదా చిరుధాన్యాలతో చేసింది) తీసుకోవడం మరవద్దు. అదికూడా ఉదయం 8 గంటలలోపే ముగించాలి.*

 

👉 10 గంటల సమయంలో పండ్లు కానీ పండ్లతో చేసిన జ్యూస్ కానీ తీసుకోండి. దీనితోపాటు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తీసుకోండి.

 

*👉మధ్యాహ్నం తీసుకునే భోజనంలో పప్పు, ఆకు కూరలు, పీచు అధికంగా ఉన్న కూరగాయలతో చేసిన కూరలు బాగా తీసుకోండి. వేడిగా వున్నపుడే తినండి. ఉడికించిన గుడ్డు మరవద్దు.*

 

👉సాయంత్రం 4 గంటల సమయంలో ఏవైనా స్నాక్స్ తీసుకోండి. అవికూడా వేడిగా ఉండేలా చూడండి. ఉడికించిన తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి.

 

*👉 5 గంటల నుండి 6 గంటల వరకు మళ్ళీ ఒకసారి వ్యాయామం చేయండి.*

 

👉మళ్ళీ ఒకసారి వేడి నీళ్లతో ఆవిరి పట్టించి అర్థగంట తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయండి.

 

*👉 రాత్రి 7:30 నుండి 8 గంటల లోపు భోజనం ముగించాలి. భోజనం వేడిగా ఉండాలి. ఆయిల్ లేకుండా చేసిన చపాతీ కూడా తీసుకోండి.*

 

👉 భోజనం తర్వాత పండ్లు తీసుకోండి. ముఖ్యంగా సి విటమిన్ ఉన్న పండు తీస్కోండి. అరటిపండు తీసుకున్నా మంచిదే. 

 

*👉ఇమ్మునిటీ బాగా ఇచ్చే ఆహారం తీలుకోవాలి.*

 

👉 అరగంట తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తాగాలి.

 

*👉 9 గంటలకి పడుకోవాలి. కనీసం 8 గంటలు మంచి నిద్ర ఉండాలి.*

 

👉అన్నిటికన్నా మించి భయాన్ని వదిలేయండి.. ధైర్యంగా ఉండాలి. ఎంతగా భయపడితే అంత ఎక్కువగా దీని ప్రభావం చూపుతుంది. కాబట్టి భయపడకండి. ధైర్యంగా ముందడుగు వేసి ఎదుర్కొండి.

 

*👉దాహం వేసినా వేయకపోయినా గంట గంట కి గోరు వెచ్చని నీళ్లు ఒక గ్లాస్ త్రాగడం మరవకండి.*

 

👉చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోండి. లేదా శానిటైజర్ ని వాడండి. 

 

*👉మాస్క్ తప్పకుండా వాడాలి. మాస్క్ చాలా విలువైనది అని మరవకండి.*

 

👉 శారీరక దూరం పాటించండి. ఫంక్షన్ లు, పార్టీ లు కొన్ని రోజులు దూరం పెట్టండి. 

 

*👉ఇంటి పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు పినాయిల్ తో కానీ డెటాల్ తో కానీ ఇంటిని శుభ్రం చేసుకోండి.*

 

👉ఏ మాత్రం కొంచెం కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే వెళ్లి పరీక్ష చేయించి డాక్టర్ గారి సలహా మరియు సూచనల మేరకు నియమాలు పాటించండి. 

 

*👉ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దు.*

 

👉జీవితం చాలా విలువైనది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగిరాదు అని మరవకండి. 

 

*👉21 రోజులు ప్రతి ఒక్కరూ పై నియమాలని పాటిస్తే కరోనా నుండి విముక్తి పొందవచ్చు.*

 

 

Related posts