telugu navyamedia
రాజకీయ

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడ‌ర్ గా ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోదీనెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు.

యూఎస్​కు చెందిన గ్లోబల్​ ‘ద మార్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌’ అనే సంస్థ నిర్వ‌హించిన ఈ స‌ర్వే ఫ‌లితాలు తాజాగా విడుద‌ల చేసింది ..71 శాతం మంది ప్రజలు ఆయనకు సానుకూలంగా స్పందించ‌గా… 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించారు. చిట్టచివరి స్థానంలో బ్రిటన్ ప్రధాని నిలిచారు.

PM Modi accorded warm welcome by Indian community in Japan

13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ అభిప్రాయాలను సేకరించింది. ఆ నాయకులకున్న పాపులారిటీని అంచనా వేసింది. వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నాయకులు, ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆదరణపై సర్వే నిర్వహిస్తుంది.

PM Modi receives 'warm welcome' in France | India News,The Indian Express

ఈ సర్వేలో న‌రేంద్ర మోడీకి 71 శాతం రేటింగ్‌ లభించినట్లు పేర్కొంది..ఆ త‌ర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ 66 శాతంతో రెండో స్థానం ఉంటే.. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ 60 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.. మ‌రోవైపు అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడె 43 శాతం రేటింగ్‌తో ఆరో స్థానాన్ని ద‌క్కించుకున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది .

PM Modi tops list of most popular world leaders with 71% rating; Full list of world leaders approval ratings

కాగా.. ‘ద మార్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌’.. సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మోదీ అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఆయ‌న ప‌నితీరు మెరుగుప‌డిన‌ట్టు ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

Related posts