ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని మరోసారి స్పష్టం చేశారు. అమరావతికి నాడు అసెంబ్లీలో సీఎం జగన్ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. రాజధాని కోసం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు.
అమరావతిలో భూసమీకరణ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్లాట్లు అందజేశామని తెలిపారు. రాజధాని రైతులకు పదేళ్ల పాటు ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. 2022 నాటికి అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మించాలని భావించామని పేర్కొన్నారు.