telugu navyamedia
సినిమా వార్తలు

తల్లైన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా..

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గుడ్​న్యూస్ చెప్పింది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్‌ జోనస్‌ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.ఈ విషయాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం తమకు ప్రైవసీ ఇవ్వాలని అభిమానుల్ని కోరుతూ ట్వీట్ చేసింది. దీంతో ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్‌ల‌కు అంద‌రూ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

Nick Jonas and wife Priyanka Chopra welcome first child via surrogate as  couple gushes they're 'overjoyed' with new baby

కాగా.. ప్రియాంక 2018 డిసెంబర్‌లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్​ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్ళి వేడుకలు రాజస్తాన్‌లోని ఉమైద్‌ భవన్‌ రాజభవనంలో మూడు రోజుల పాటు జరిగాయి. క్రిస్టియన్‌ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.

Priyanka Chopra Jonas gave the most typical answer when asked about her  baby plans with Nick Jonas | PINKVILLA

సినిమాలు విష‌యానికొస్తే…ప్రియాంక నటించిన ‘ద మ్యాట్రిక్ 4’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె నటించిన హిందీ సినిమా ‘ద వైట్ టైగర్’.. నెట్​ఫ్లిక్స్​లో రిలీజైంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే టీవీ షోలో నటిస్తోంది. ‘టెక్స్ట్ ఫర్ యూ’ సినిమాలోనూ నటిస్తూ ప్రియాంక బిజీగా ఉంది.

Priyanka Chopra and Nick Jonas in love during Caribbean honeymoon as he  calls them 'Mr & Mrs Jonas' | Daily Mail Online

Related posts