telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ చేతిలో “డ్రైవింగ్ లైసెన్స్” రైట్స్

Ram-Charan

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ ఒకవైపు “ఆర్ఆర్ఆర్”లో నటిస్తూనే…. చిరంజీవి, కొరటాల శివ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నటుడుగా, నిర్మాతగానూ సక్సెస్ అయిన రామ్ చరణ్ భవిష్యత్తులో తన బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ రైట్స్‌ను చరణ్ కొనుగోలు చేశారు. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవి హీరోగా పెట్టి తీయాలని చరణ్ ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. తాజాగా మరో మలయాళ సినిమా రైట్స్‌ను చరణ్ కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమా రీమేక్ రైట్స్‌ను చరణ్ కొన్నారట. పృథ్వీరాజ్ హీరోగా నటించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ కిందటేడాది డిసెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఒక స్టార్ హీరో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను కోల్పోవడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ సినిమాను తానే హీరోగా చరణ్ నిర్మిస్తారో.. లేదంటే మెగా కాంపౌండ్‌లో మరో హీరో చేతికి ఇస్తారో చూడాలి.

Related posts