telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్..ఎప్పుడంటే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు.

Watch: RRR trailer with Ram Charan, Jr NTR and Alia Bhatt is power-packed |  The News Minute

ఇప్పటికే కరోనా వలన పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వ‌స్తున్న ఈ సినిమా తాజాగా కొత్త విడుదల తేదీని రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్‌. దేశంలో కరోనా పరిస్థితుల మెరుగుపడితే మార్చి 18న లేదంటే.. ఏప్రిల్​ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.

RRR Trailer Ram Charan Jr NTR Impress As Revolutionaries Intense Action  Sequences Take The Cake Watch

డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు..అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. 

Related posts