కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కనిపించబోతున్నట్టు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. చెర్రీ సరసన సమంత నటించనున్నట్టు సమాచారం. తాజాగా చెర్రీ పాత్ర గురించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్‌గా కనిపించబోతున్నాడట. చెర్రీ రోల్ 40 నిమిషాల పాటు ఉంటుందట. ఒక పాట, ఫైట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు `ఆచార్య` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
previous post
next post
ఇందులో దాచేదేమీ లేదు… కాస్టింగ్ కౌచ్ పై అనుష్క షాకింగ్ కామెంట్స్