telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వీడియోతో దొరికిపోయిన లోబో..

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌గా సెప్టెంబర్‌ 5న ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు విజయవంతం కాగా తాజాగా 5వ సీజన్ అడుగుపెట్టింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు వారి డ్యాన్స్‌లు, వారి ప్రమోలతో సందడిగా మారింది.

కింగ్ నాగార్జున వరసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. వీరిలో ఆరో కంటెస్టెంట్‌గా పాల్గొన్న వారిలో లోబో ఒకరు. అయితే లోబోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో పాల్గొన్న వారిలో లోబో ఒకరు.

Bigg boss tidbits: Lobo trolled for previous comments on BB

బిగ్‌బాస్‌ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని గతంలో ఓ యాంకర్‌ ప్రశ్నించగా..’బిగ్‌బాస్‌ షోకు ఓ దండం. అది నా టేస్ట్‌ కాదు. షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు’ అంటూ లోబో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.చాన్స్‌ రానంత వరకు బిగ్‌బాస్‌ షోను తిట్టడం, ఆ తర్వాత ఇలా ప్లేటు మార్చడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు.

కాగా.. మా టీవీ ద్వారానే కెరీర్‌ ప్రారంభించిన లోబో ఇప్పుడు అదే చానల్‌ నిర్వహిస్తోన్న షోలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

Related posts