telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 22, శ‌నివారం రాశిఫ‌లాలు

మేషరాశి..

అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం శ్ర‌ద్ద చూపించ‌డం మంచిది. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు శ్ర‌మ పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.

వృషభరాశి..

మహిళలకు శ్రమ పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులతో అధిక వ్యయం చేస్తారు. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి. ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమ‌వుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. బంధువర్గంతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిథునరాశి..

నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా అధిగమిస్తారు. తలనొప్పితో బాధపడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. మహిళలకు శుభ‌ప‌రిణామం.

కర్కాటకరాశి..

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పిల్లల ద్వారా చికాకులు. ముఖ్య‌మైన పనుల్లో అవంతారాలు ఏర్ప‌డ‌తాయి. ధనం ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతుంది. ఆరోగ్యసమస్యలు త‌లెత్తుతాయి. భూవివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. కుటుంబంలో చికాకులు తొలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు పనిభారం ఎక్కువ‌వుతుంది.

సింహరాశి..

సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. కుటుంబ స‌భ్యుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ‌స్తులు ఉన్నత హోదాలు పొందుతారు. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

కన్యరాశి..

ఇష్టమైన వారితో స‌ర‌దాగా గడుపుతారు. మిత్రులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. అన్న‌ద‌మ్ములు మ‌ధ్య ఆస్తి తగదాలు పెరుగుతాయి . ఎంత క‌ష్ట‌ప‌డ్డా త‌గిన ఫలితం కనిపించదు. మహిళలకు ఆరోగ్యసమస్యలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలలో లేనిపోని సమస్యలు వ‌స్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

తులరాశి..

త‌ల పెట్టిన ప‌నుల్లో విజ‌యం పొందుతారు. మహిళలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శుభవార్త ను వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం కలుగుతుంది. అనుకోని ఆస్తిలాభం. వ్యాపారాలు లాభ‌సాటిగా ముందుకు వెళ‌తాయి. ఉద్యోగ‌స్తుల‌కు మంచికాలం. మిత్రుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి..

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు రాత ప‌రీక్ష‌ల్లో విజయాలను సాధిస్తారు. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సంంఘంలో మీ పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. భూ, గృహయోగాలు సూచ‌న‌లు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సురాశి..

మీరు చేసే పనిపట్ల పూర్తి బాధ్యతగా ఉండండి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబసమస్యలు త‌లెత్తుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు త‌లెత్తుతాయి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది.

మకరరాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్య‌ సమస్యల‌తో బాధపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి.

కుంభరాశి..

విద్యార్ధులు శ్రద్ధ వహించండం మంచిది. నూతన ఉద్యోగప్రాప్తి క‌లుగుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని భారం ఎక్కువ‌వుతుంది.

మీనరాశి..

కార్యాలయంలో తొటి ఉద్యోగుల‌తో విభేదాలు ఏర్ప‌డ‌వ‌చ్చు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గుర్తింపు ల‌భిస్తుంది. దైవదర్శనాలు చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది. వాహనయోగం క‌లుగుతుంది. విద్యార్థుల ప్ర‌యత్నాలు సఫలం అవుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts