telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త కార్పొరేటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం..

Kcr telangana cm

నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మేయర్‌ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎంపికకు రంగం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్‌ ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీల్డ్‌ కవర్‌లో నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. గ్రేటర్‌ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. 32 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు 10 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌ ఓటు హక్కును కలిగి ఉన్నారు.

జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి 11 గంటల నుంచి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయర్. ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది

Related posts