telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆది సాయికుమార్ .. తదుపరి చిత్రం…

aadi saikumar new project on birthday

నటుడు ఆది సాయికుమార్ పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు కథను అందించారు. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆది సాయి కుమార్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆది సాయికుమార్ చేసిన గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని తెలిపారు. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి సింగల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి.. సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమాను నిర్మించబోతున్నట్లు నిర్మాత మహంకాళి దివాకర్ తెలిపారు. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Related posts