telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసిపి నాయకులు, మిల్లర్లు కలిసి… రైతులను దోచుకుంటున్నారు…

chandrababu tdp

 రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మద్దతు ధర కొనుగోళ్లలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలవుతున్నా అతీగతి లేదని.. టీడీపీ హయాంలో 48 గంటల్లోనే రైతులకు నగదు జమ చేశామని లేఖలో చెప్పారు. అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరిస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమలో వేరుశెనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదని, ధాన్యం కొనుగోలుకు ఆర్బీకేల పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని, ఈ- క్రాప్‌లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. 

Related posts