telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భావోద్వేగానికి లోనైన సోనూసూద్

Sonusood

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ హీరో సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా లాక్ డౌన్‌తో రోడ్డున పడ్డ వలస కార్మికులకు ఇళ్లను చేర్చడం, చిత్తూరు జిల్లా రైతు ఇంటికి ట్రాక్టర్ పంపాడు. ఆ తర్వాత తెలంగాణలో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ శారదకు జాబ్ లెటర్ అందించాడు. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కి సాయం చేస్తానని సోనూ సూద్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోనూ కపిల్ శర్మ టీవీ షోకు హాజరయ్యాడు. లాక్ డౌన్ తర్వాతా తాజాగా మొదలైన ఈ షోకు సోనూ హాజరయ్యాడు. దీంతో ఆ షోలో సోనూ చేసిన సాయానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియోను ప్రసారం చేశారు. దీంతో ఆ వీడియో చూసిన సోనూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోనీ టీవీ ది కపిల్ శర్మ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, ఇందులో ఆ సన్నివేశాలు కనిపించాయి. ఆగస్ట్ 1న సోనూ షోకు హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానున్నట్టు పేర్కొన్నారు. కాగా చిరంజీవి నటిస్తున్న చిత్రంలో కూడా సోనూ సూద్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts