రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలను నడపాలని తెలిపారు. ఇందు కోసం ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలని సూచించారు.
కరోనా కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక ఫంక్షన్ హాల్ ను రాజమండ్రిలోని జైన్ సంఘం అద్దెకు తీసుకుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించాలని వాటికి ఫీజును ప్రభుత్వమే నిర్దేశించాలని పేర్కొన్నారు.
డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదు: మల్లుభట్టి