telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ నుంచి చరణ్ కొత్త పోస్టర్ రిలీజ్‌..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వ‌స్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం). దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ వచ్చేస్తోంది.

ఈ సినిమాలోని రామచరణ్ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు చిత్ర‌యూనిట్‌. పో లీస్‌గా సూపర్​ లుక్​లో కనిపించిన చరణ్.. తెగ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గర్జిస్తూ మరింత అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అంతకు ముందు ఈ రోజు ఉదయం, ఎన్టీఆర్​ ​ కొమురం భీమ్ పోస్టర్ లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో అడవిలో చెరో చేత్తో తాళ్లు పట్టుకుని ఆగ్రహంతో కనిపించారు తారక్.

Ntr

ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రానుంది.

RRR Update: ఆర్‌.ఆర్‌.ఆర్‌ నుంచి రామ రాజు లుక్ వచ్చేసింది.. చెర్రీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూస్తే..

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇటీవ‌ల విడుద‌లైన‌ పోస్ట‌ర్స్‌, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.

Related posts