telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఉగాది పురస్కారాలు.. అందుకుంటున్నది వీరే..

ugadi awards presentation

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఇండో ఏషియన్‌ అకాడమీ సంయుక్తంగా, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని సమాఖ్య కార్యాధ్యక్షుడు బి.మా ల్యాద్రి, ప్రధాన కార్యదర్శి కె.వి.శాస్త్రి, అధ్యక్షుడు సి.మహేశ్వర్‌లు నగరంలో గురువారం విడుదలచేసిన ప్రకటనలో తెలి పారు. నగరంలోని కల్యాణ్‌నగర్‌ బస్టాండ్‌ సమీ పాన గల ఇండో ఏషియన్‌ అకాడమీ క్యాంప స్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిధిగా ఉస్మానియా విశ్వ విద్యాలయ తెలుగు విభాగాధిపతి, ప్రముఖ కవి ప్రొ.మాసన చెన్నప్ప పాల్గొననున్నారు. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య కార్యదర్శి కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి. అఽధ్యక్షత వహించనున్నారు. సమాఖ్య అధ్యక్షుడు సిరిపంగి మహేశ్వర్‌తో పా టు పలువురు ప్రసంగిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీనాధ్‌ ఆర్‌.భరద్వాజ్‌చే లలిత సంగీత కార్యక్రమం, ఉంటుందన్నారు. ఇదే వేది కపై రమా రాజగోపాల్‌ రచించిన సంప్రదాయ పాటలు పుస్తకావిష్కరణ జరుగనుంది.

ఉగాది పురస్కారాలు అందుకుంటున్న వారిలో .. ప్రముఖ కన్నడ రచయిత బేలూరు రఘునందన్‌, ఒడిస్సా కవయిత్రి స్వప్నా భేరా, హిందీ కవి, రచయిత దీవాస్‌ గుప్తా, ప్రముఖ ఆంగ్ల తెలుగు రచ యిత్రి అంబికా అనంత్‌, మలయాళం రచయిత్రి ఇందిరా బాలన్‌, ప్రముఖ తెలుగు రచయిత్రి ఆచంట హైమవతి, మరాఠి కవయిత్రి చంద్రమ దేశ్‌ముఖ్‌, ప్రముఖ బహుభాషా రచయిత్రి రేష్మా రమేష్‌, ప్రముఖ తెలుగు నటుడు రచ యిత నూనె అంకమ్మరావ్‌, తెలుగు రచయిత్రి నటి చిత్రలేఖ, తమిళ కవి ప్రొ.డి.కొదం డరామన్‌ ఉన్నారు. వీరందరికీ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సన్మానించనున్నారు.

Related posts