మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకింది. సీఎం నివాసం ఎదురుగా ఉండే వీరికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని అధికారులు వెల్లడించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ ఘటనతో ఇప్పుడున్న భద్రతా సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఇండియాలో మహారాష్ట్రలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన తెలిసిందే. మొత్తం కేసులో 25 శాతానికి పైగా ఇక్కడే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 12,300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ