telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టిక్ టాక్ స్టార్ పై లక్ష్మీ అగర్వాల్ ఫైర్

Lakshmi

ఫేమస్‌ టిక్‌టాక్‌ స్టార్‌ ఫైజాల్‌ సిద్దిఖీ. ఇతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. ఇతను చేసే ప్రతి వీడియో చాలా పాపులర్‌ అవుతుంది. ఇటీవల అతను చేసిన ఓ వీడియోలో “ఒక అమ్మాయిపై యాసిడ్‌ పోసి అతను మాత్రం నవ్వుతూ ఉంటాడు”. ఇది రియల్‌ కాదు. జస్ట్‌ వీడియో కోసం ఇలా చేశారు. దీంతో ఈ వీడియోపై యాసిడ్‌ ఆటాక్‌ సర్వైవర్‌ లక్ష్మి అగర్వాల్‌ మండిపడింది. “ఈ నటనకి ఫిదా అయి అభిమానులు దాన్నే ఫాలో అయితే బలయ్యేది అమ్మాయిలు. పాపులారిటీ కోసం ఏమైనా చేస్తారా? ఫేమ్‌ కోసం ఇలాంటి వీడియోలను ప్రోత్సహిస్తే సహించేది లేదు” అంటూ ఫైజాల్‌పై, లక్ష్మి మండిపడింది. అంతేకాదు ఈ వీడియోను బిజెపి నాయకుడు తాజిందర్‌ బాగ్గా నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్‌సిడబ్లూ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Related posts