telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యాన్సీ రేటుకు కీర్తి సురేష్ చిత్రం డిజిటల్ రైట్స్

Miss

“మహానటి”తో భారీ విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ కు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో “పెంగ్విన్” చిత్రం విడుదల కాగా… మరో రెండు చిత్రాలు కూడా ఓటిటి లోనే విడుదలకు సిద్ధమయ్యాయి. చాలారోజుల నుంచి విపరీతమైన బజ్ వినిపిస్తున్న కీర్తి సురేష్ చిత్రం “మిస్ ఇండియా”. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. వారు ఈ చిత్రానికి 11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇటీవలే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలోనటించిన “గుడ్ లక్ సఖి” టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related posts