శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నచిత్రం ఇండియన్ 2. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ నటించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలలో, అజయ్ దేవ్‌గణ్ నెగటివ్ పాత్రలో నటిస్తారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. కమల్ బర్త్‌డే సందర్భంగా చిత్రంలో కమల్‌కి సంబంధించి లుక్ విడుదల చేశారు. ఇందులో ఎత్తైన కోటపై నిలుచొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు కమల్. అయితే కొద్ది రోజులుగా కమల్‌కి సంబంధించిన మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఫేక్ అని తేల్చేసింది.
previous post
అత్యాచారం తప్పదనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయటమే… అమితాబ్ వ్యాఖ్యలు వైరల్