telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అవన్నీ పుకార్లే .. పోలింగ్ ప్రశాంతంగానే .. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది.. : ద్వివేది

ap election officer altered

కొన్ని చోట్ల ఈవీఎం లు సమస్యాత్మకంగా ఉన్నా కూడా వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఈవీఎంతో పోలింగ్ సజావుగా సాగుతోందని ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలూ అవసరం లేదు. మాక్ పోలింగ్ ద్వారా అనుమానాలు తీర్చిన తర్వాతే పోలింగ్ ప్రారంభించాం. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగుతోంది. ఈవీఎం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి” అని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఏపీ దక్షిణ భాగంలోని రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 14 చొప్పున అసెంబ్లీ స్థానాలు, కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని చోట్లా పోలింగ్ కొనసాగుతోంది.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభం అయిందని ఏపీ ప్రధాన ద్వివేది పేర్కొన్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉండడంతో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్య అవకాశం ఉందన్నారు.

ఓటర్లు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని, ఓటింగ్ అత్యంత ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఈవీఎంలలో సాంకేతికమైన లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించడం జరిగిందని.. సక్రమంగా కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్లే కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా కొన్ని కేంద్రాలలో అక్కడి సిబ్బందే వాటిని పరిష్కరించారని చెప్పారు. ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Related posts