telugu navyamedia
సినిమా వార్తలు

పుష్ప’ ఫస్ట్ అప్డేట్..!

 

స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్నభారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా ఎర్ర‌ చందనం స్మగ్లర్ గా పుష్ప రాజ్ ‘పుష్ప’ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వేషం డిఫరెంట్‌గా కొత్తగా ఉంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా..ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ ఎపుడు విడుదల చేస్తుందో ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. బ‌న్నీ-సుకుమార్‌-దేవిశ్రీ కాంబినేష‌న్‌లో వస్తోన్న ఈ సినిమా హ్యాట్రిక్ అనే చెప్ప‌చ్చు. కాగా ఈ సినిమా స్టోరీను రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పుష్ప’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ‘పుష్ప’ మొదటి భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగ‌స్ట్ 13న రిలీజ్ చేయ‌నున్నారు. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. హిందీలో ఈ పాట‌ను విశాల్ ద‌డ్‌లాని, క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం, త‌మిళంలో బెన్నీ ద‌యాల్ పాట‌ని ఆల‌పించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక పేరుతో ఈ పాట రూపొందింది.

Related posts