telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జంతువులను రక్షించే వారు గొప్పవారు : మోడీ

modi attracting investments from

జంతువులను రక్షించే వారు గొప్పవారని భారత ప్రధాని మోడీ అన్నారు. ఇటువంటి వారి కారణంగా సమాజంలో సున్నితత్వాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ విషయాలను ప్రధాని మోదీ తన 72వ రేడియో ప్రోగ్రామ్‌లో చెప్పారు. ప్రతి ఆదివారం వచ్చే ప్రధాని మోదీగారి ‘మన్ కీ బాత్’లో వీటిని పలికారు. అంతేకాకుండా ఇందులో కోయంబత్తూర్‌లో ఓ కాళ్లులేని శునాకానికి ఇప్పడు ఒక వీల్‌చెయిర్ వచ్చింది. దాన్ని దత్తతు తీసుకున్న యజమాని దాని కోసంగా ప్రత్యేకంగా ఆ వీల్‌చెయిర్‌ను చేయించాడు. ‘తమిళనాడు కోయంబత్తూర్‌లో జరిగిన గొప్ప పని గురించి నేను చదివాను, దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో మీరు తప్పక చూడాలి. సాధారణంగా మనుషులకు వీల్‌చెయిర్‌ను ఇస్తారు. కానీ కొయంబత్తూర్‌లోని గాయత్రి అనే అమ్మాయి తన తండ్రి సహాయంతో ఓ బాధ పడుతున్న ఓ కుక్కకు వీల్‌చెయిర్‌ను తయారు చేయించింది. ఇటువంటివి కేవలం మనుషులు తమ హృదయాలు దయతో నిండి ఉన్నప్పుడే జరుగుతాయి. దానితో పాటుగా వారు ఆ కుక్కను దత్తత తీసుకున్నారు. దానికి వీరా అనే పేరు పెట్టారు. వీరితో పాటుగా ఎందరో జంతు ప్రేమికులు ఈ చలికాలంలో జంతువులకు తోచిన విధంగా సహాయపడుతున్నారు. ఢిల్లీ కొందరు చలికి జంతువులు తట్టుకోలేక పోతున్నాయని వాటికి తిండి, నీళ్లు, స్వెటర్‌లు అంతెందుకు బెడ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా దేశం నలుమూలలా కూడా జంతుప్రేమికులు తమకు కుదిరినంతగా జంతువులకు సహాయం అందిస్తున్నారు.

Related posts