తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. శాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏపీలో హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఆరోపించారు. హిందుత్వంపై దాడులను బీజేపీ సహించదని సోము స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గత టీడీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని మాట్లాడే హక్కు టీడీపీకి లేదని అన్నారు.
నాడు కృష్ణా పుష్కరాల సందర్భంగా 17 దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం నేలమట్టం చేసిందని అన్నారు. అప్పుడు హిందుత్వం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. విజయవాడ గోశాల ఘటనపై మీడియా సమావేశం నిర్వహిస్తుంటే తమపై బుద్ధా వెంకన్న దాడికి యత్నించాడని ఆరోపించారు.
జగన్ వి ఒంటెద్దు పోకడలు: పురందేశ్వరి