telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వివేకా హత్య కేసు :సీబీఐకి రఘురామ లేఖ..

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. . ఇటీవలి కాలంలో వివేకా హత్యకు సంబంధించిన అనుమానితులు, సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సీబీఐకు నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవేంతం చేయాలని రఘరామ కృష్ణరాజు ఆ లేఖలో కోరారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ కేసులో నిందితులు ఒకరైతే వారి వెనుక మాస్టర్ మైండ్ ఉందన్నారు. పరిటాల రవి హత్య కేసు మాదిరిగానే ఇందులో కూడా నిందుతులు, కీలక సాక్ష్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైలుతో పాటు జైలు బయట ఉన్నవారికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు కూడా భంగం కలిగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

వివేకా హత్య కేసు వెనుక మాస్టర్ మైండ్ ఉంది.. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని కూడా విచారించాలని లేఖలో కోరారు. వివేకా మర్డర్ కేసుపై రఘురామ సీబీఐకి లేఖరాయడం చర్చనీయాంశమవుతోంది. అందునా విజయసాయిని టార్గెట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల రఘురామరాజు రూ.1,100 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి సీబీఐకి లేఖరాసిన సంగతి తెలిసిందే. అందుకు కౌంటర్ గానే రఘురామ కూడా సాయిరెడ్డిని ఇరుకున పెట్టేలా సీబీఐకి లేఖ రాశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts