telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ధర్మవరం టికెట్ ఇవ్వ‌కుంటే పార్టీ నుంచి త‌ప్పుకుంటా..

అనంతపురం జిల్లా మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌ త‌న‌యుడు, తెలుగుదేశం పార్టీ ధ‌ర్మ‌వ‌రం ఇంఛార్జి ప‌రిటాల 
శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన… వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతూ ..పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.

Paritala Sriram: Political sanction if Dharmavaram ticket does not arrive ... TDP leader Paritala Sriram sensational comments » Jsnewstimes

ఈ క్ర‌మంలో ధర్మవరంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గౌరవసభ-ప్రజాసమస్యల చర్చావేదిక’ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ధ‌ర్మంవ‌రంలో కొంత‌మంది మీటింగ్‌లు పెట్టి టికెట్ తెచ్చుకుంటామ‌ని కాల‌ర్ ఎగురేస్తున్నార‌ని అన్నారు. ఒక‌వేళ వారు టికెట్ టిక్క‌ట్ తెచ్చుకుంటే తాను టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వ‌తంగా రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని పరిటాల శ్రీరామ్ ప్ర‌క‌టించారు. పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా కండువా వేసి ఆహ్వానిస్తామ‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే పార్టీలో ప‌ద‌వులు ఇప్పిస్తామ‌ని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి గురించి కార్య‌క‌ర్త‌లు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీని ఎలా అభివద్ధి చేయాలి.? గ్రామాల‌ను ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని అన్న విధంగా పనిచేయాలని శ్రీరామ్  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తప్పుడు కథనాలు వద్దు, ఆ అమ్మాయి మృతి, కిడ్నాప్‌తో సంబంధం లేదు: పరిటాల శ్రీరామ్ | paritala sriram response on crime allegations on him - Telugu Oneindia

టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అన్న విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ నేతల పనిపడతామని వార్నింగ్ ఇచ్చారు. వీదేశాల్లో దాకున్నా బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో వాలంటీర్లు వైసీపీ నేతల్లాగా వ్యవహరిస్తున్నారని పద్ధతు మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.

paritala-sunitha-srirama- | Manalokam

కాగా.. గత ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. ఈసారి రాప్తాడు నుంచి తన తల్లి , మాజీ మంత్రి సునితమ్మ పోటీ చేస్తుందని శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం టికెట్ పై పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.

Related posts