telugu navyamedia
రాజకీయ వార్తలు

చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…

jagadish reddy trs

ముఖ్యమంత్రి కేసీఆర్… గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే  విధంగా వ్యవసాయానికి, గ్రామీణ  వృత్తుల కు  పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం.. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి… చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పెంచడం వల్ల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. నేడు మత్స్య కారులు  చేతినిండా సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో, ముందు చూపుతో  వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు పూర్వవైభవం వచ్చింది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైన ఆసరా పెన్షన్ లు, రైతు బంధు సాయం తో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాల వల్ల గ్రామాల్లో  ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరుపుకుంటున్నారు అని చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి ఏదైనా తెలంగాణ సమాజం అంత కేసీఆర్ వెంటే నడుస్తుంది అని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్తమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.

Related posts