telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అందులో కోహ్లీని మించిపోయిన బుమ్రా…

ఈ ఏడాది భారత జట్టులో పేసర్ జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐ నుండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆటగాడిగా అవతరించాడు. గాయం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన బుమ్రా మ్యాచ్ ఫీజుల రూపంలో మొత్తం రూ .1.38 కోట్లు అందుకొని కోహ్లీని అధిగమించాడు. అయితే బీసీసీఐ యొక్క ఎ + కాంట్రాక్టులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లలో ఒక్కడైనా బుమ్రా ఈ ఏడాదిలో 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ 20లు ఆడాడు. అయితే బీసీసీఐ భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫజులా రూపంలో ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు రూ .15 లక్షలు, వన్డేలో రూ .6 లక్షలు అలాగే టీ20 మ్యాచ్ కు రూ .3 లక్షలు చెల్లిస్తుంది. అంటే 2020 లో బుమ్రా బీసీసీఐ నుండి రూ .1.38 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది 3 టెస్టులు,  వన్డేలు, 10 టీ 20 లు ఆడిన కోహ్లీ రూ .1.29 కోట్లు మ్యాచ్ ఫీజుల రూపంలో తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ఆడితే ఎప్పటిలాగే అతనే మొదటి స్థానంలో ఉండేవాడు. అయితే ఈ జాబితాలో 96 లక్షలతో మూడో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా, రోహిత్ శర్మ ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లోకి ప్రవేశించలేకపోయాడు. టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ ఫిట్నెస్ సమస్యల కారణంగా న్యూజిలాండ్ పర్యటనలో 3 వన్డేలు మరియు రెండు టెస్ట్ మ్యాచ్లను కోల్పోవలసి వచ్చింది. రోహిత్ కూడా ఆస్ట్రేలియా మ్యాచ్లలో ఎక్కువ భాగం కాలేదు. అయితే రోహిత్ 2020 లో 3 వన్డేలు మరియు 4 టీ 20 ల్లో మాత్రమే ఆడాడు కాబట్టి, అతను రూ .30 లక్షల తీసుకున్నాడు. అతను ఈ సంవత్సరం రెడ్ బాల్ మ్యాచ్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు.

Related posts