telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దోమకాటుకు కరోనా వస్తుందా

masketo

ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అటు మన దేశంలో కూడా 21 రోజుల లాక్ డౌన్ నడుస్తోంది. మొత్తం బంద్ కావడంతో జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వేళ వారిలో అనేక డౌట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొన్నింటికి సమాధానం దొరికినా మరికొన్నింటి విషయాల్లో మాత్రం ఏ క్లారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ప్రజల్లో మెదులుతున్న ఓ డౌట్.. దోమ కాటు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా.? దీనిపై తాజాగా కేంద్రం ఓ క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దోమకాటు కారణంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఈగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం లేదని వెల్లడించింది. అదే కాకుండా సోషల్ మీడియాలో వస్తున్న పలు ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇంచక్కా ఇంట్లో నుంచి బయటికి రాకుంటే చాలని తెలియజేసింది.

Related posts