telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కొత్త కరోనా వ్యాక్సిన్…

corona vacccine covid-19

దాదాపు ఏడాదికి పైగా కరోనాకు మందు కనుగోవడానికి పట్టింది. అయితే ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తీవ్రత మాత్రం తగ్గడం లేదు.  రూపాంతరం చెంది మహమ్మారి ఇబ్బందులు పెడుతున్నది.  ముఖ్యంగా బ్రిటన్ తో పాటుగా యూరప్ అమెరికా దేశాల్లో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు.  కరోనాకు వివిధ దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.  అయితే, ఇప్పుడు మరో వ్యాక్సిన్ పై బ్రిటన్ కు చెందిన నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.  వృక్షాల నుంచి తయారు చేసిన థాప్సిగార్గిన్ అనే యాంటీ వైరస్ ఔషధంతో ప్రయోగాలు చేస్తున్నారు.  ఈ  థాప్సిగార్గిన్ ను తగిన మోతాదులో ఇచ్చినపుడు అది వైరస్ పై సమర్ధవంతంగా ఫైట్ చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  పైగా దీనిని నోటిద్వారా తీసుకునేందుకు వీలుగా ఉండటంతో ఇంజెక్షన్లు, ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ఉండబోదని నిపుణులు చెప్తున్నారు.  ప్రస్తుతం తొలిదశలోనే వ్యాక్సిన్ ప్రయోగాలు ఉన్నాయని, త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts