telugu navyamedia
సినిమా వార్తలు

నవదీప్ అంటే అసహ్యం… సిక్స్ ప్యాక్ ఫోటోషాప్… మంచు విష్ణు వ్యాఖ్యలు

Manchu-Vishnu

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేశాడు యంగ్ హీరో న‌వ‌దీప్. అంతేకాదు అనేక టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 2004లో వ‌చ్చిన “జై” సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో న‌వ‌దీప్‌ ఇప్పుడు కేవ‌లం స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్ర‌మే చేస్తున్నాడు. ప్రస్తుతం న‌వ‌దీప్ అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయ‌న సిక్స్ ప్యాక్ లుక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కొద్ది రోజులుగా గంట‌ల‌పాటు జిమ్‌లో శ్ర‌మించిన న‌వ‌దీప్ కండ‌లు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఆయ‌న లుక్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏ సినిమా కోసం న‌వ‌దీప్ ఈ లుక్‌లోకి మారి ఉంటాడు అనే చర్చ మొదలైంది నెటిజన్ల మధ్య. తాజాగా హీరో మంచు విష్ణు నవదీప్ పై పరోక్షంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. “నవదీప్ నాకు ఎప్పుడూ నచ్చేవాడు కాదు. ఈ ఫోటో చూసిన తర్వాత (నవదీప్ సిక్స్ ఫ్యాన్ బాడీని ఉద్దేశిస్తూ) అతడిని అసహ్యించుకోవడానికి మరో కారణం దొరికింది. ఇది ఫోటోషాప్ చేసిన లుక్” అంటూ మంచు విష్ణు నవదీప్ ని పరోక్షంగా ప్రశంసించాడు. నవదీప్ ఈ లుక్ కోసం గత 6 నెలల నుంచి కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాను ఇలా సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారడానికి అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా ఇన్స్పిరేషన్ అని నవదీప్ తెలిపాడు.

Related posts