telugu navyamedia
సినిమా వార్తలు

పది మంది మేలు కోసం ప్రతిక్షణం పరితపించే నా తమ్ముడు.. నిప్పు కణం

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పవన్ అభిమానులే. తన స్టైల్, ఆటిట్యూడ్ అంటే అభిమానులు పడిచస్తారు. చిత్రపరిశ్రమలో మరే హీరోకు అందనంత క్రేజ్.. ఫాలోయింగ్ ఒక్క పవన్‏కు మాత్రమే దక్కింది అనడంలో సందేహం లేదు.

Image

ఇక పవన్ సినిమా వస్తుందంటే చాలు..సంబరాలు అంబరాన్నంటుతాయి. థియేటర్లలో, నెట్టింట్లో ఆయన అభిమానులు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ పుట్టిన రోజు అంటే ఊరూరా పండగ జరుపుకుంటారు అభిమానులు. ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ వేత్తలు పవన్ తో అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. అయితే ఈ అన్ని స్పెషల్ విషెష్ లో మాత్రం పవన్ సోదరుడు హీరో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషెష్ మరింత ప్రత్యేకం అని చెప్పాలి.

Image

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కళ్యాణ్‎కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు . చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి..

 

Related posts