telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే షాకవ్వాల్సిందే…!

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హాజరయ్యారు. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. నైజాం ఏరియాలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు, కృష్ణలో రూ.8 కోట్లు, గుంటూరులో రూ.12.50 కోట్లు, నెల్లూరులో రూ.4.50 కోట్లు, వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో రూ.19 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.16 కోట్లు .. మొత్తంగా రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.125 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో రూ.18 కోట్లు, బాలీవుడ్‌లో రూ.120 కోట్లు, ఓవర్ సీస్‌లో 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అంటే దాదాపు రూ.333కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మరి వసూళ్ల పరంగా “సాహో” ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts