telugu navyamedia
సినిమా వార్తలు

అదిరిపోయిన “రాజ్ దూత్” టీజర్

Rajdooth

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి మేఘాంశ్ హీరోగా “రాజ్‌దూత్” అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘాంశ్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక క‌థానాయిక‌గా రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక న‌టిస్తుంది. తాజాగా చిత్ర టీజ‌ర్‌ని జీవిత చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర ధారులు ఇద్ద‌రు ఆక‌ట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే ఈ లవ్ స్టోరీ మొత్తం ఒక బైక్ చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరైన డిస్కోశాంతి త‌న కొడుకు తండ్రి పేరు నిల‌బెడ‌తాడ‌ని చెప్పుకొచ్చారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts