telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …

mandi ad troubles vijay setupati

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్‌ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నారు విజయ్ సేతుపతి. ఉప్పెన చాలా బావుంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా తన కల్ట్ చిత్రం 96 కంటే బావుంటుందని సేతుపతి కితాబివ్వడం గమనర్హం. కాగా 96లో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అటు విజయ్, ఇటు త్రిష కెరీర్లో గుర్తుండిపోయే మూవీగా నిలిచింది. అలాంటి 96 కంటే ఇప్పుడు ఉప్పెన బావుంటుందని విజయ్‌ ప్రశంసలు కురిపించడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

Related posts