telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

హడావుడి లేకుండా .. విడుదలైన సూర్య చిత్రం.. కాప్పాన్‌ ..

surya movie without cutouts

కొత్త చిత్రం విడుదలైన రోజు భారీ కటౌట్లు, బ్యానర్లతో థియేటర్ల ముందు అభిమానుల హంగామాగా,  హడావుడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా విడుదలైన సూర్య నటించిన ‘కాప్పాన్‌’ చిత్రానికి ఎలాంటి హంగామా కనిపించలేదు. అందుకు కారణం తన చిత్ర విడుదల సమయంలో అభిమానులెవరూ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టవద్దని సూర్య ప్రకటించడమే.

ఇటీవల ఓ రాజకీయ పార్టికి చెందిన నాయకుడు ఒకరు పెట్టిన ఫ్లెక్సీ కారణంగా టూవిలర్‌లో ప్రయాణిస్తు అటు వైపుగా వెళుతున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ మహిళా ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఇక నుంచి తమ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టకూడదని రాజకీయ, సినీ ప్రముఖులు ప్రకటించారు. అలా ప్రకటించిన వారిలో సూర్య కూడా వుండడం తో హడావుడి లేకుండానే చిత్రం విడుదల జరిగిపోయింది.

Related posts