తొలి వన్డేలో టీం ఇండియా దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్నతొలి వన్డేలో బ్యాట్స్ మెన్స్ విజృంభించడంతో భారీ స్కోర్ సాధించింది టీం ఇండియా. ఓపెనర్ ధావన్ 98 పరుగులతో ఇండియా మంచి స్టార్ ఇచ్చాడు. అటు కోహ్లి 56, కేఎల్ రాహుల్ 62, కృనాల్ పాండ్య 58 పరుగులు చేసి టీం ఇండియా భారీ స్కోర్ ను అందించారు. టాప్ ఆర్డర్ సక్సెస్ కావడంతో టీం ఇండియా 50 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. అటు రోహిత్ 28 పరుగులు, శ్రేయస్ 6, పాండ్య1 చేసి ఫేల్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్‌వుడ్ కూడా రెండు వికెట్లు తీసి రాణించాడు. ఇక తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన కృనాల్… రెచ్చిపోయి అర్ధశతకం చేసి టీం ఇండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 50 ఓవర్లలో 318 పరుగులు చేయాల్సి ఉంటుంది.
తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ