telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కూతురు పేరు వాడుకుని బన్నీ ఏం చేశాడో తెలుసా..!

allu-arjun

ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అందరిని అలరిస్తున్న టాక్ షో సామ్ జామ్. ఈ షోకు వక్తగా అక్కినేని కోడలు సమంత వ్యవహరిస్తోంది. ఈ షోకు అనేక మంది తారలు వచ్చి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ షోటో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్‌ను న్యూఇయర్ స్పెషల్‌గా విడుదల చేశారు. దాంతో అభిమానుల ఆనందం ఆకాశానికి అంటింది. ఇదిలా ఉంటే ఈ షో మధ్యలో అల్లు అరవింద్ కలిసి అభిమానుల సంతోషాన్ని తారాస్థాయికి చేర్చారు. అయితే ఇందులో స్టైలిష్ స్టార్ చదువుకునే రోజుల్లో చేసిన అల్లర్లను అరవింద్ అభిమానులతో పంచుకున్నారు. వాటిలో ఒక ప్రత్యేక దానిని చెప్పి పుష్ప హీరో పరువు తీసేశారు. ఈ షోలో అరవింద్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..‘ వీడు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ చిన్నప్పుడు బాబోయ్ మామూలు అల్లరి కాదు అంటూ దండం పెట్టాడు. మీకు అసలు ఈ విషయం తెలీదు కదూ.. వినండి. అర్జున్ లెవెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లో ఒకసారి వారి ప్రిన్సిపల్ నన్ను స్కూలుకు రావాలని కారారు. ఎందులో తెలియకపోయినా నేను వెళ్లాను. ప్రెన్సిపల్ అర్జున్ మార్కుల చిట్టా చూపించారు. ఆ ప్రోగ్రెస్ కార్డు మొత్తం చూస్తే ఎక్కడ చూసినా 20, 25 మార్కులే కనిపించాయి. అవి చూశాక కచ్చితంగా ప్రిన్సిపల్ వాడి మార్కుల గురించి పెద్ద క్లాస్ తీసుకుంటాడని ఫిక్స్ అయిపోయా. కానీ ప్రిన్సిపల్ మాత్రం చాలా కామ్‌గా అతడి ప్రోగ్రెస్‌ను పట్టించుకోకండి అన్నారు. ఇంతలో అర్జున్ మనం వెళ్లోచ్చు అనడంతో నేను అక్కడి నుంచి వెళ్లిపోయా. అసలు ఇదేంటి ప్రిన్సిపల్ అంత తక్కువ మార్కులు వచ్చినా ఏమన కుండా పంపేశారని. అర్జున్ స్నేహితులను ఆరా తీశాను. అప్పుడు అసలు విషయం బయట పడింది. ఆ రోజు నేను ప్రిన్సిపల్ ఆఫీసుకు వెళ్లే సరికి వీడు వెళ్లి ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. మీకో కూతురు ఉండొచ్చు. ఒకవేల నేను తనని ప్రేమించవచ్చు. తను కూడా నన్ను ప్రేమించవచ్చు. ప్రేమించాక ఏమైనా జరగొచ్చ అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడంతో ప్రిన్సిపల్ ఏమనుకుండా పంపేశాడు. అది వినేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీడు చేజారిపోతాడేమో అనుకున్నా. కానీ అలా కాలేద’ని అల్లు అరవింద్ అర్జున్ పరువు కాస్తా తీసేశారు. అంతేకాకుండా సాధారణంగా వీడు అల్లరి చేస్తుంటాడని ఫ్యాన్స్‌కి తెలుగు కానీ వీడు చేసే అల్లరి మీరు ఊహించలేరని అరవింద్ అన్నారు.

Related posts