telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖి, వితిక, పునర్నవిలను చితకబాదిన హిమజ… సుమనే సాక్ష్యం…!

Himaja

తెలుగులో బిగ్ బాస్-3 విజయవంతగా సాగుతోంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ హిమజ తొమ్మిది వారాల పాటు హౌజ్ లో ఉండి ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పూర్తి రెబల్ కంటెస్టెంట్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది హిమజ. తొమ్మిదవ వారం ఎలిమినేట్ అయ్యి హౌజ్ లో నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ సుమ సాక్షిగా వాళ్లను చితకబాది వాళ్లపై ఉన్న కోపాన్ని తీర్చుకుంది. వాళ్లపై ఉన్న కసి కోపాన్ని ఊహించుకుని బొమ్మలను చితకబాదింది ఈ హాట్ బ్యూటీ. ఎదురుగా ఉన్నపుడు వాళ్లపై కోపాన్ని ప్రదర్శించడం కష్టమే. ఇప్పుడు సుమ కనకాల హోస్టుగా ఉన్న F3 షోకు వచ్చింది హిమజ. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మీకున్న ఫీలింగ్స్ చూపించండి అంటూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఒక్కొక్కరితో ఆడేసుకుంది.. ముఖ్యంగా పునర్నవి, వితిక, శ్రీముఖి పేర్లు చెప్పగానే ఆ బొమ్మలను ఓ రేంజ్‌లో ఉతికేసింది హిమజ. దాన్నిబట్టి వాళ్ళపై ఆమెకున్న కోపం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీముఖి, వితిక, పునర్నవిపై విమర్శలు చేస్తూనే ఉంది హిమజ. ఇప్పుడు మరోసారి ఆ ఫ్రస్టేషన్ బయటికి వచ్చింది. మొత్తానికి ఈ ప్రోమో ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

Related posts