telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో కరెంట్ కష్టాలు…

america

అమెరికా చరిత్రలోనే ఇదే పెద్ద మంచు తుఫాన్‌ వచ్చింది.. తుఫాన్ దెబ్బకు లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం.. టెక్సాస్, లూసియానా, కెంటకీ, మిస్సౌరీ ఇలా మంచు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 23 మంది మరణించారు. ఇక, విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.. దాదాపు 14 రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొన్నట్టు అమెరికన్ మీడియా చెబుతుతోంది.. చివరకు విద్యుత్‌ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. భయంకరమైన శీతాకాలంలో విద్యుత్‌ సరఫరా లేకుండా దాదాపు 2.5 మిలియన్ల మంది చీకటిలో మగ్గాల్సిన పరిస్థితులు దాపురించాయి. టెక్సాస్‌లో గ్రిడ్ వైఫల్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ నాలుగు మిలియన్ల మందికి పైగా అంధకారంలో గడపాల్సి వచ్చింది. నైరుతి మరియు మిడ్‌వెస్ట్‌లోని ప్రత్యేక ప్రాంతీయ గ్రిడ్‌లు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో మంచు తుఫాన్ పడడం 122 ఏళ్ల తర్వాత అని చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులు గడ్డకట్టడం వల్ల టెక్సాస్‌లో ఒక మిలియన్ బారెల్స్ చమురు, 10 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఉత్పత్తి పైప్‌లైన్ మూసివేశారు. రికార్డ్-బ్రేకింగ్ శీతల వాతావరణం అమెరికన్లను అతలాకుతలం చేస్తోంది.. ఎలక్ట్రిక్ హీటర్లు వాడుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. వాతావరణ మార్పులతో ఒక్కసారిగి విద్యుత్ డిమాండ్ పెరగడం.. అదే సమయంలో, మంచుతో నిండిన పరిస్థితుల మధ్య గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఎక్కువ భాగం ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి. సహజ వాయువు డిమాండ్ పెరగడంతో కొన్ని ప్లాంట్లు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి.

Related posts