telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“యాక్షన్” సినిమాలో తమన్నా పాత్ర ఇదే

Action

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్‌ తమిళ అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది. మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్‌, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ పాత్ర‌లు, క‌మ‌ర్షియ‌ల్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.. ఈ మ‌ధ్య రొటీన్‌కి భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా త‌మ‌న్నా న‌టిస్తోన్న”యాక్ష‌న్‌” చిత్రంలో హీరో విశాల్‌తో క‌లిసి త‌మ‌న్నా చేసిన ఫైట్స్ చూసి అంద‌రూ థ్రిల్ అవుతున్నారు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో త‌మ‌న్నా అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. పాత్ర కోసం త‌మ‌న్నా స్పెష‌ల్ యాక్ష‌న్ సీన్స్‌లో ట్రైనింగ్ తీసుకుని న‌టించింద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. అజ‌ర్ బైజాన్‌, టర్కీ దేశాల్లో ఈ సినిమాను చిత్రీక‌రించారు.

Related posts