telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వెన్న వేడి చేసి ప్యాంటులో… సీనియర్ చెఫ్ నిర్వాకం

Butter

ఇంగ్లండ్‌లోని కాల్కట్ అండ్ స్పా హోటల్ లో ఓ సీనియర్ చెఫ్ జూనియర్ చెఫ్ పట్ల ఇలా దారుణంగా వ్యవహరించాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఓ సీనియర్ చెఫ్ తన జూనియర్‌ను ఏడిపించాలనుకున్నాడు. దాని కోసం వెన్నను బాగా వేడి చేసి నాథన్ డేవిస్ అనే కొత్త చెఫ్ ప్యాంటులో పోశాడు. దీంతో డేవిస్‌కు పిరుదులు, వెనుక భాగం కాలిపోయింది. విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల కొద్దిగా గాయాలు మానగానే డేవిస్ ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆ గాయలు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయి. ఈ విషయం సీరియస్ అయ్యి హోటల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వెంటనే ఈ చర్యకు పాల్పడిన సీనియర్ చెఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది సదరు హోటల్. ఈ విషయం గురించి చెప్పిన డేవిస్… చెఫ్‌లు ఇలానే ర్యాగింగ్ చేస్తారని, కొత్తగా వంటగదిలో అడుగుపెట్టే వాళ్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు.

Related posts