telugu navyamedia
రాజకీయ వార్తలు

మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి.. టీవీ ఛానల్ పై పాక్ మంత్రి ఫైర్

పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీ పాకిస్థాన్ కు చెందిన ఎక్స్ ప్రెస్ న్యూస్ టీవీ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ చేస్తున్న వాదనలు మూడు దేశాలు (చైనా, టర్కీ, మలేషియా) మినహా మరే దేశం కానీ, ఐక్యరాజ్యసమితి కానీ వినడం లేదు. మరోవైపు ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ వివాదానికి సంబంధించి తమకు 58 దేశాల మద్దతు ఉందని చెప్పారు.

ఇదే విషయంపై పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీని పాకిస్థాన్ కు చెందిన ఎక్స్ ప్రెస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రశ్నించింది. పాక్ కు మద్దతిస్తున్న ఆ 58 దేశాల పేర్లను చెప్పాలని సదరు ఛానల్ ప్రశ్నించగా… ఖురేషీ ఆగ్రహానికి గురయ్యారు. ఎవరి అజెండాతో మీరు పని చేస్తున్నారంటూ చిందులు తొక్కారు. పాకిస్థాన్ కు ఎవరు మద్దతిస్తున్నారు? ఎవరు ఇవ్వడం లేదు? అనే విషయాన్ని మీరు నన్ను అడగాలనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. మీకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండంటూ టీవీ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts